Breaking News

ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్ట్‌

Published on Sun, 09/28/2025 - 10:03

న్యూఢిల్లీ/ఆగ్రా: ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతి(62) జాడను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. ఆగ్రాలోని ఓ హోటల్‌లో బస చేసిన అతడిని ఆదివారం వేకువజామున అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్‌లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్‌ చేసే సౌకర్యం ఉండటం గమనార్హం. 

ఈ ఫోన్‌ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తనకు పరిచయస్తులున్నారని చెప్పుకుంటూ చైతన్యానంద, అతడి శిష్యులు అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కేసు నమోదు కావడంతో అరెస్ట్‌ భయంతో ఆగస్ట్‌ 4వ తేదీన ఢిల్లీని దొంగచాటుగా వదిలిన చైతన్యానంద, ఇతడి శిష్యులు పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మథుర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్నారు. 

చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్‌ కమిషన్‌ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్‌ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్‌లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు. 

ఢిల్లీలోని మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్‌లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ
చైతన్యానంద సరస్వతిని ఢిల్లీ కోర్టు ఆదివారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైతన్యానంద పలువురు విద్యార్థినులను వేధించాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసేవాడని పలువురు బాధితులకు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆరోపించారు. విద్యార్థినుల బాత్‌రూంలలోనూ ఇతడు సీసీటీవీ కెమెరాలను అమర్చాడని బాధితుల తరఫు లాయర్లు ఆరోపించారు. 

సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్‌మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్‌ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్‌ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్‌ రవి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)