Breaking News

పార్టీలు మారి.. పరాజితులయ్యారు

Published on Sun, 02/09/2025 - 07:57

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీ మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి.

ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్‌ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్‌ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు.

మిల్కిపూర్‌లో బీజేపీ ఘన విజయం
యూపీలోని అయోధ్య జిల్లాలో మిల్కి పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్ని కలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో, ఈ జిల్లాలోని అన్ని స్థానాలూ బీజేపీ వశమైన ట్లయింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మిల్కిపూర్‌ (ఎస్‌సీ) ఎమ్మెల్యే అవధేశ్‌ ప్రసాద్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవాలని అవధేశ్‌ ప్రసాద్‌ కుమారుడు అజిత్‌ ప్రసాద్‌ను బరిలోకి దించింది.

అయితే, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్‌ 61,710 ఓట్ల మెజారిటీతో అజిత్‌పై ఘన విజయం సాధించారు. అదేవిధంగా, తమిళనాడులోని ఈరోడ్‌(ఈస్ట్‌)స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే విజయం సాధించింది.  డీఎంకే అభ్యర్థి చందిర కుమార్, సమీప ప్రత్యర్థి నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్‌టీకే)కు చెందిన ఎంకే సీతాలక్ష్మిపై 91 వేల పైచిలుకు ఓట్లతో తిరుగులేని గెలుపు సాధించారు. ఈరోడ్‌(ఈస్ట్‌) నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌కు చెందిన ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతితో ఈ ఉప ఎన్నిక జరిగింది.  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు