Breaking News

Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం

Published on Wed, 01/22/2025 - 07:05

ఫిబ్రవరి(2025)లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు  సమాయత్తమవుతున్నాయి. వ్యూహప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. అయితే అటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్.. ఈ పార్టీల కళ్లన్నీ దళిత ఓటర్లపైనే ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో దళితుల ఓట్లు అధికారాన్ని నిర్ణయిస్తాయి. వీరి మద్దతు ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. అయితే దళితుల ఆధిపత్యం 20 సీట్లలో  కొనసాగుతోంది. ఢిల్లీలో దళిత ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  అందుకే ఈ మూడు పార్టీలు దళితులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలోని 70 సీట్లలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సీ) రిజర్వ్ చేశారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 17 శాతం మంది దళితులున్నారు. వీరిలో 38 శాతం మంది జాట్‌లు, 21 శాతం మంది వాల్మీకి సమాజానికి చెందినవారు.

ఈసారి ఢిల్లీలో బీజేపీ 14, కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 12 మంది దళిత అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వ్డ్ సీట్ల కంటే ఎక్కువమంది దళిత అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాయి. బీజేపీ జనరల్ స్థానాల నుండి ఇద్దరు దళిత అభ్యర్థులను నిలబెట్టింది. వారు మాటియా మహల్ నుండి దీప్తి ఇండోరా, బల్లిమారన్ నుండి కమల్ బాగ్డి. కాంగ్రెస్ కూడా నరేలా జనరల్ స్థానం నుండి దళిత అభ్యర్థి అరుణ కుమారిని నిలబెట్టింది.

ఎస్సీ సీట్లపై ఆధిపత్యం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు

2020: ఆప్ 12 సీట్లు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
2015: ఆప్ 12 సీట్లు గెలుచుకుంది.
2013: ఆప్ 9 సీట్లు గెలుచుకుంది.
2008: కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది.
2003: కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంది.
1998: కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంది.
1993: బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.

ఈ లెక్కలను అనుసరించి చూస్తే ఈసారి కూడా అధికారానికి షెడ్యూల్డ్ కులాల ఓట్లు కీలకంగా మారనున్నాయనే అంచనాలున్నాయి. అందుకే వివిధ పార్టీలు షెడ్యూలు కులాల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ, వారిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 20 దళిత ప్రాబల్య స్థానాల విషయానికి వస్తే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 56 శాతం ఓట్లతో 19 సీట్లను సొంతం చేసుకుంది. నాడు బీజేపీ ఖాతాలోకి ఒకే ఒక సీటు వచ్చింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.

2015, 2020లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు(Scheduled Castes) రిజర్వ్ చేసిన 12 నియోజకవర్గాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ స్థానాల్లో రెండు లేదా మూడు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. ఢిల్లీలోని 12 సీట్లలో దళిత సమాజ ఓటర్లు 17 నుండి 45 శాతం వరకు ఉన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)