Breaking News

ఢిల్లీలో జీఆర్‌ఏపీ ఉపసంహరణకు సుప్రీం అనుమతి

Published on Thu, 12/05/2024 - 17:46

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. గురువారం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 161గా నమోదైంది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్‌​ పరిధిలో కాలుష్య కట్టడికి విధించిన గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన​ ప్లాన్‌-4 (జీఆర్‌ఏపీ) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

ఈ మేరకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. గాలి నాణ్యత మెరుగుపడిన నేపథ్యంలో జీఆర్‌ఏపీ ఆంక్షలను ఉపసంహరించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 

గా గత నెల రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యంగా తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఒకానాక దశలో ఏక్యూఐ 500 స్థాయికి కూడా చేరడంతో. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ  గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేసింది. దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్‌ ఫ్రం హోం చేయాలని  ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు నిర్వహించారు. 

ఇదిలా ఉండగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)