Breaking News

బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే..

Published on Mon, 06/05/2023 - 13:25

ప్రస్తుత ఆధునిక కాలంలోనూ అనేక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇవి వినేందుకు చాలా వింతగా అనిపిస్తాయి. తాజాగా రాజస్థాన్‌లోని భీల్వాడాలో అటువంటి ఉందంతమే చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువతి తన ప్రియునితో వెళ్లిపోయింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం వెదుకులాట సాగించి, ఆమెను కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేది లేదని, తాను ఇంటికి తిరిగివెళ్లేది లేదని తెగేసిచెప్పింది. కుమార్తె ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడం చూసి, కుటుంబ సభ్యులు ఆమె మరణించినట్లేనని భావిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు గుర్తుగా శోక సందేశాన్ని కూడా ప్రచురించారు. దానిలో కుమార్తె మరణించిన 13 రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసి, బంధువులను ఆహ్వానించారు. కాగా ఈ సంతాప సందేశం సోషల్‌ మీడియాలో చర్చాంశనీయంగా మారింది.  ఆమె ఫొటో ముద్రించిన ​కార్డు వైరల్‌ అవుతోంది. సజీవంగా ఉన్న కుమార్తె మృతి చెందిదని పేర్కొంటూ, బంధువులను దశదిన కర్మలకు ఆహ్వానించడాన్ని స్థానికులు వింతగా భావిస్తున్నారు.

రతన్‌పురా గ్రామానికి చెందిన ప్రియ జాట్‌ తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా తనకు ఇష్టమైన యువకునితో వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హమీర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌లో  కుమార్తె అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను వెదికి, కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకు వెళ్లబోగా, ఆమె కుటుంబ సభ్యులకు కలిసేందుకు నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమార్తె జూన్‌ 1న చనిపోయిందని పేర్కొంటూ, జూన్‌ 13న సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వైరల్‌ అవుతున్న ఈ కార్డును చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  

చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)