Breaking News

రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..

Published on Mon, 02/17/2025 - 07:59

న్యూఢిల్లీ:  ఆ కుటుంబంలోని వారంతా మహాకుంభ్‌లో స్నానం చేసేందుకు శనివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారిలో ఏడేళ్ల బాలిక రియా కూడా ఉంది. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తెల ఎలా ప్రాణాలు కోల్పోయిందనే విషయాన్ని రియా తండ్రి ఓపిల్‌ సింగ్‌ మీడియాకు చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముందుగా వారంతా 14వ నంబరు ప్లాట్‌ఫారానికి చేరుకున్నారు. అయితే అక్కడి రద్దీని చూసి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోదామని అనుకున్నారు. దీంతో అతని భార్య, కుమారుడు ప్లాట్‌ఫారం నుంచి తిరిగి మెట్లు మీదుగా పైకి చేరుకున్నారు. వారి వెనుక ఓపిల్‌ సింగ్‌, అతని కుమార్తె రియా ఉన్నారు. ఇంతలో ఐదారువేల మంది పైనుంచి ఒక్కసారిగా ఒకరిని తోసుకుంటూ మరొకరు కిందకు దిగసాగారు. ఇంతటి రద్దీలో వారంతా ఒకరిపై మరొకరు పడిపోయారు.  దీంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో వారి కుమార్తె రియా కిందపడిపోయింది. ఆమె తలకు ఒక రాడ్డు బలంగా తగిలింది. వెంటనే రక్తం కారసాగింది.  తొక్కిసలాట జరుగుతున్నా పోలీసులు అప్రమత్తం కాలేదు. నామమాత్రంగా విజిల్‌ వేసుకుంటూ వెళ్లిపోయారు.

అంతటి రద్దీలో కుమార్తెను ఎత్తుకుని ఓపిల్‌ సింగ్‌తో అతని భార్య, కుమారుడు ఎలాగోలా కిందకు దిగి, రైల్వే స్టేషన్‌ బయటకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓపిల్‌ సింగ్‌ జేబులోని పర్సుతో పాటు మొబైల్‌ ఫోనును ఎవరో కొట్టేశారు. అక్కడ అంబులెన్స్‌ లేకపోవడంతో ఓపిల్‌సింగ్‌ తన కుమార్తె రియాను తీసుకుని, ఆటోలో కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి రియాను పరీక్షించి, ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. తమ కుమార్తె చనిపోయాక ప్రభుత్వం ఇచ్చే రూ. 10 లక్షల పరిహారం ఎందుకుని ఓపిల్‌ సింగ్‌ మీడియా ముందు కంటతడిపెట్టుకున్నారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)