Breaking News

డేటింగ్‌ యాప్‌.. సహజీవనం.. చివరికి..

Published on Sun, 02/22/2026 - 12:38

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. సహజీవనం.. అనుమానం.. చివరకు పైశాచిక చేష్టలు.. గురుగ్రామ్‌లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవడానికి త్రిపుర నుండి గురుగ్రామ్ వచ్చిన 19 ఏళ్ల యువతి.. ఓ యువకుడితో సహజీవనం సాగిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న శివం.. యువతిపై  అమానుషంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ నిలదీసినందుకు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. చిత్రహింసలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన శివమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివం పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ కలిసి సెక్టార్-69లో ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన శివం ఆమెను గదిలో బంధించాడు. స్టీల్‌ బాటిల్‌తో తలపై కొట్టి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కత్తితో కూడా దాడి చేశాడు.

మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతి.. తన తల్లికి ఫోన్ చేసిన జరిగిన ఘోరాన్ని వివరించింది.. తల్లి ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. అంనతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు శివంను అరెస్ట్‌ చేసిన పోలసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఫిబ్రవరి 16న జరిగిన గొడవ తర్వాత శివం తనపై అత్యంత క్రూరంగా దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె తలపై స్టీల్ బాటిల్‌తో, మట్టి కుండతో కొట్టాడు. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు వివరించింది. దారుణమైన దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. ఫిబ్రవరి 18 రాత్రి ఆమె నిందితుడి ఫోన్ నుండే తన తల్లికి ఫోన్ చేసింది. శివంకు అర్థం కాకుండా ఆమె బెంగాలీ భాషలో తన బాధను వివరించింది. తనను ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే వచ్చి కాపాడండంటూ ఆమె తన తల్లితో చెప్పింది. బాధితురాలి తల్లి వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)