సైక్లోన్‌ సెన్యార్‌: తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

Published on Wed, 11/26/2025 - 11:24

మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం.. ఇది వేగంగా ముందుకు కదులుతూ 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ సహా పలు తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ తుపానుగా సెన్యార్‌గా(Cyclone Senyar) పేరు పెట్టారు.

మలక్కా జలసంధి (Strait of Malacca).. దక్షిణ ఆండమాన్ సముద్రం ప్రాంతంలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తుఫానుగా మారింది. మలేషియా జార్జ్‌టౌన్‌కు సుమారు 260 కి.మీ. పశ్చిమ-దక్షిణ పశ్చిమ దూరంలో, నికోబార్ దీవులకు 600 కి.మీ. తూర్పు-దక్షిణ తూర్పున కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా గంటకు సుమారు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. కాగా.. యూఏఈ దీనికి సెన్యార్‌ అని సూచించింది. దీనర్థం "సింహం" అని.

IMD అంచనా ప్రకారం.. సెన్యార్ తుఫాను మొదట పశ్చిమ-దక్షిణ పశ్చిమ దిశగా కదిలి, తర్వాతి 48 గంటల్లో తిరిగి తూర్పు దిశగా మళ్లనుంది. ఇండోనేషియా సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని.. 24 గంటలపాటు తుఫాను తీవ్రతను కొనసాగించి, తర్వాత క్రమంగా బలహీనపడనుందని పేర్కొంది.

సెన్యార్‌ ప్రభావంతో.. అండమాన్ & నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రంలో అలలు ఎత్తుగా ఎగసే అవకాశం ఉండటంతో, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)