Breaking News

గుజరాత్ అలెర్ట్.. తీవ్రరూపం దాల్చనున్న బిపర్ జాయ్ తుఫాను 

Published on Sun, 06/11/2023 - 11:56

గుజరాత్ సమీపంలో కేంద్రీకృతమైన బిపర్ జాయ్ తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు చెబుతోంది ఐఎండీ శాఖ. రాబోయే ఐదు రోజుల్లో సౌరాష్ట్ర - కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు తెలిపారు ఐఎండీ శాఖ అధికారులు.     

రానున్న ఐదు రోజులు.. 
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా పెను తుఫానుగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి గంటకు 170 కి.మీ కంటే వేగాంగా బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వారు తెలిపిన వివరాల ప్రకారం తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ జూన్ 15 నాటికి గుజరాత్ పాకిస్తాన్ తీరాన్ని తాకే అవకాశముందన్నారు. గుజరాత్ తీరంలో రానున్న ఐదు రోజుల పాటు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అల్పపీడనం అంతకంతకు బలపడి బుధవారం నాటికి మరింత తీవ్రమవుతుందన్నారు. 

అలెర్ట్.. అలెర్ట్.. 
కాబట్టి తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే పర్యాటక కేంద్రమైన తితాల్ బీచ్లో కెరటాల ఉధృతి ఎక్కువవడంతో పర్యాటకులు సందర్శించకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లోని జాలరులను వేటకు వెళ్లవద్దని కూడా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని  అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల వెంబడి అత్యవసర సేవలందించడానికి ముందుగానే విపత్తు నిర్వహణ బృందాలను కూడా పంపించారు.        
     

ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా?

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు