Breaking News

గుజరాత్‌ను వీడని బిపర్‌జోయ్‌

Published on Tue, 06/20/2023 - 05:34


అహ్మదాబాద్‌/జైపూర్‌/గువాహటి/ సాక్షి, చెన్నై: బిపర్‌జోయ్‌ తుపాను వాయుగుండంగా మారడంతో గుజరాత్, రాజస్తాన్‌ల్లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్‌ బనస్కాంత జిల్లా ధనేరా తాలుకాలో వరదలు సంభవించాయని అధికారులు సోమవారం తెలిపారు. 20 వరకు పశువులు కొట్టుకుపోయాయన్నారు. వచ్చే రెండు రోజుల్లో సౌరాష్ట్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది.

అదేవిధంగా, రాజస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాలి, సిరోహి, బర్మేర్, జలోర్‌ జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.  వరదల్లో చిక్కుకున్న 265 మందిని యంత్రాంగం కాపాడింది. అజ్మేర్‌లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన వానకు స్థానిక జేఎల్‌ఎన్‌ ఆస్పత్రిలోకి వరద ప్రవేశించింది.

18 మంది రోగులను ఇతర వార్డులకు అధికారులు తరలించారు. రాజస్తాన్‌ మీదుగా ఏర్పడిన అల్పపీడనం బుధవారం కల్లా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది.  అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో పంట పొలాలు, గ్రామాలు, పట్టణాలు నీటి ముంపునకు గురయ్యాయి. లఖింపూర్‌లోని 25,200 మంది సహా మొత్తం 33,400 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురువారం వరకు రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరించింది.

చెన్నైలో స్కూళ్లకు సెలవు
ఆదివారం రాత్రి నుంచి తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతోపాటు చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)