Breaking News

CWC meet: ఎన్నికలకు సిద్ధంకండి

Published on Fri, 12/22/2023 - 06:12

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్‌ పెద్దలు సూచించారు.

సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, సీనియర్‌ నేతలు రాహుల్‌ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు.

తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది.

బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది.

‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)