Breaking News

ప్రిస్క్రిప్షన్‌ బాగు.. బాగు..

Published on Wed, 07/24/2024 - 04:44

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్‌లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ బడ్జెట్‌లో కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్‌ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్‌)పై కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘కేన్సర్‌ రోగులకు ఉపశమనం ఇచ్చేందుకు మరో మూడు మందులపై కస్టమ్స్‌ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే ట్యూబ్స్, మెడికల్‌ ఎక్స్‌రే మిషన్లలో వాడే ఫ్లాట్‌ ప్యానెల్‌ డిటెక్టర్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ (బీసీడీ)లో మార్పులు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు గత ఏడాది రూ.3వేల కోట్లు ఇవ్వగా, ఈసారి 3,712.49కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.77,624.79 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.100కోట్ల మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు గత ఏడాది రూ.31,550.87 కోట్లు ఉండగా, ఈసారి అది 36,000 కోట్లకు పెరిగింది. 

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌కు గత ఏడాది మాదిరే రూ.200 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు గత ఏడాది (రూ.17,250.90) కేటాయించిన దాని కంటే స్వల్పంగా పెంచుతూ రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు గత ఏడాది రూ.4,278 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్‌ కౌన్సిల్‌కు గత ఏడాది రూ.2295.12 కోట్ల ఇవ్వగా ఈసారి రూ.2,732.13 కోట్లు కేటాయించారు.

మూడు కేన్సర్‌ మందులు 20% మేర తగ్గుతాయి
కేన్సర్‌ చికిత్సలో వాడే మూడు రకాల మందులపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించడంపై ఆరోగ్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సుంకం తగ్గింపు వల్ల మందుల ధరలు 10–20 శాతం మేర తగ్గుతాయని ఢిల్లీలోని సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన సర్జికల్‌ ఆంకాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ మన్‌దీప్‌ సింగ్‌ మల్హోత్రా చెప్పారు. అయితే, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను ఈ బడ్జెట్‌ కూడా నెరవేర్చకపో వడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)