సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మహత్యలు .. అత్యధికం విధుల్లో ఉన్నప్పుడే..

Published on Thu, 08/06/2026 - 09:57

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందిలో ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకర స్థాయికి చేరాయి. అధికారిక సమాచారం ప్రకారం 2025లో సీఆర్పీఎఫ్ సిబ్బందిలో ఆత్మహత్యల సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికంగా 59కి చేరింది. 2021 నుంచి మే 2026 వరకు ఉన్న కాలానికి సంబంధించి సేకరించిన ఈ డేటా, సిబ్బంది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత సాధించలేకపోవడమే ఈ దుర్ఘటనలకు ప్రధాన కారణమని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

వివరాల ప్రకారం 2021లో 57, 2022లో 43, 2023లో 57, 2024లో 46, 2025లో 59 ఆత్మహత్యలు నమోదయ్యాయి. అలాగే 2026 మే నాటికి మరో 19 కేసులు వెలుగుచూశాయి. మొత్తం పరిశీలనా కాలంలో 281 ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో దాదాపు 77 శాతం (216 కేసులు) సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడే జరగడం గమనార్హం. సెలవులో ఉన్నప్పుడు 65 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా 2025లో సెలవులో ఉండి బలవన్మరణానికి పాల్పడిన వారి సంఖ్య 19కి చేరి, మునుపటి మూడేళ్ల సగటు కంటే రెట్టింపు కావడం గమనించదగ్గ విషయం.

వీరు ఆత్మహత్యలకు ఉపయోగించిన పద్ధతులను విశ్లేషిస్తే, ఉరి వేసుకోవడం, ఆయుధాలతో కాల్చుకోవడం ద్వారానే దాదాపు అన్ని (94 శాతం) ఘటనలు జరిగాయి. 281 కేసుల్లో 136 మంది ఉరివేసుకుని, 127 మంది కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సభ్యుల మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువుకు సంబంధించి తగిన అవకాశాలు లేకపోవడం వంటి వ్యక్తిగత కారణాలే ప్రధానంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయని ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ నివేదిక వెల్లడించింది. మగ సిబ్బందిలో సమస్యలను తోటివారితో పంచుకోవడానికి వెనుకాడటం వల్ల ఒత్తిడి పెరుగుతోందని, మహిళా సిబ్బందిలో ఆత్మహత్యల ప్రయత్నాలు తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలు!

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)