Breaking News

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి

Published on Mon, 08/19/2024 - 18:21

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్‌ పోలీసులకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్స్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్‌ఎపీఎఫ్‌ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల  తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. 

జూలై 8న కతువా జిల్లాలోని  పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)