Breaking News

అమెరికాకు.. స్టెమ్‌ భారతీయులే!

Published on Mon, 10/06/2025 - 02:15

హెచ్‌ –1బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థులందరినీ షాక్‌కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోకముందే.. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌లో ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను పూర్తిగా ఎత్తేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే.. ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరో శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ ( స్టెమ్‌) విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

గ్రాడ్యుయేషన్స్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎఫ్‌ –1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువు / విభాగానికి సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు.

తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ  పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే.  ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్‌ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్‌ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384.

అనుభవం.. అవకాశాలు!
చాలామంది భారతీయులు ప్రత్యేకించి స్టెమ్‌ విభాగాల్లోని వారు.. హెచ్‌–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేముందు ప్రాక్టికల్‌ అనుభవం కోసం ఓపీటీని ఉపయోగించుకునేవారు. ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీ అనేది కాలేజీ చదువు పూర్తిచేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.

‘స్టెమ్‌’ మీద దెబ్బ
అమెరికా ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశ ‘స్టెమ్‌’ శ్రామికశక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో హెచ్‌ –1బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్‌ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్‌ కార్మికులు / ఉద్యోగుల్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4 శాతం నుంచి 2019 నాటికి 23.1 శాతానికి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్‌ ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం భారతీయులే.  

ప్రతి నలుగురిలో ముగ్గురు..: 2023–24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు స్టెమ్‌ కోర్సులు చదువుతున్నవారే.  స్టెమ్‌ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం కావడం విశేషం.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)