Breaking News

ప్రేమించడం నేరమా?: సుప్రీంకోర్టు

Published on Wed, 08/20/2025 - 07:51

న్యూఢిల్లీ: ప్రేమించడం నేరం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముస్లిం బాలికల కనీస పెళ్లి వయసుకు సంబంధించిన వ్యవహారంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. పంజాబ్‌లో 21 ఏళ్ల ముస్లిం యువకుడు, 16 ఏళ్ల ముస్లిం బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు. 

ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ వివాహం చెల్లుతుందని పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. రజస్వల అయిన తర్వాత లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవచ్చని వెల్లడించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌సీపీసీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సైతం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.బి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. బాలిక, యువకుడి మధ్య అంగీకారంతోనే పెళ్లి జరిగిందని గుర్తుచేసింది. సమాజంలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపింది. బాలబాలికలు ఒకచోట కలిసి చదువుకుంటున్నప్పుడు వారి మధ్య ఆకర్షణ ఏర్పడడం సహజమేనని పేర్కొంది. వారి మధ్య ప్రేమను నేరంగా పరిగణించడం సరైంది కాదని తేల్చిచెప్పింది.  ఎన్‌సీడబ్ల్యూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.  

 

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)