Breaking News

పార్లమెంట్‌ సమావేశాల్లో వ్యూహంపై చర్చ

Published on Mon, 07/14/2025 - 06:06

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అధ్యక్షతన ఆమె 10 జన్‌పథ్‌ నివాసంలో భేటీ జగనుంది. ఇందులో రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలతోపాటు ఉభయ సభల ఉప నేతలు, పార్టీ చీఫ్‌ విప్‌లు, విప్‌లు పాల్గొంటారు. కొందరు సీనియర్‌ నేతలు కూడా పాలుపంచుకుంటారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్ట్‌ 21 వరకు పార్లమెంట్‌ సెషన్‌ కొనసాగనుంది.

ఆపరేషన్‌ సిందూర్‌తోపాటు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ తదితర అంశాలపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు కని్పస్తున్నాయి. బిహార్‌ ఓటరు జాబితా సవరణను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ఈసీ చర్య రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అదేవిధంగా, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మోదీ ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడి, దేశానికి నష్ట కలిగించిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

అంతేకాదు, భారత్‌–పాక్‌ మధ్య అణు యుద్ధం ప్రమాదం తన జోక్యంతోనే తొలగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే ప్రకటనలు చేయడంపైనా ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. పై అంశాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలకు కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో పట్టుబట్టే ఛాన్సుంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో ఉగ్రమూకల దాడి, అమెరికా టారిప్‌లు వంటి వాటిపైనా ఇండియా కూటమి చర్చకు ప్రభుత్వాన్ని నిలదీస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ వ్యూహం ఖరారైతే ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)