Breaking News

త్రిపుర: సీపీఐ నేత హత్య.. వ్యాపార సంస్థలు బంద్‌

Published on Sun, 07/14/2024 - 07:08

అగర్తల: దక్షిణ త్రిపురలోని రాజ్‌నగర్‌లో సీపీఐ నేత బాదల్ షీల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ హత్య సంచలనంగా మారింది. జిల్లా పరిషత్ అభ్యర్థి షిల్‌ను బీజేపీ మద్దతు ‍కలిగిన గూండాలు హత్య చేశారని త్రిపుర ప్రతిపక్ష సీపీఐ (ఎం) ఆరోపించింది. ఈ హత్యకు నిరసనగా నేడు (ఆదివారం) 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని రాష్ట్ర బీజేపీ తెలిపింది. దక్షిణ త్రిపుర ఎస్పీ అశోక్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేత షీల్‌పై కొందరు దాడి చేశారని, నిందితులను ఇంకా గుర్తించలేదన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారన్నారు. తాము ఈ కేసును సుమోటోగా తీసుకున్నామన్నారు.

రాజ్‌నగర్ మార్కెట్‌లో షీల్‌పై కత్తులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అగర్తలలోని ప్రభుత్వ  జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షీల్‌ మృతి చెందారు. పోస్టుమార్టం  అనంతరం పోలీసులు షీల్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ  ఇది బాదల్‌షీల్‌ హత్య కాదని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఈ దారుణ హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. బంద్‌ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?