Breaking News

Covid-19: దేశంలో 6,500కు చేరువలో కోవిడ్‌ కేసులు

Published on Mon, 06/09/2025 - 20:55

న్యూఢిల్లీ:  దేశంలో కోవిడ్‌-19 కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్‌ 9) నాటికి కోవిడ్‌ కేసులు 6,500 మార్కుకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 6, 491 కేసులు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గత 24 గంటల్లో 358 కొత్త కేసులు వెలుగుచూసినట్లు సదరు శాఖ వెల్లడించింది.  అయితే మరణాలు ఏవీ సంభవించలేదని స్పష్టం చేసింది.  

దేశంలో కేరళలో అత్యధికంగా 1,957 కేసులు ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు ఉన్నాయి.  ఢిల్లీలో గత 24 గంటల్లో 42 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం ఆ రాష్ట్ర కోవిడ్‌ కేసుల సంఖ్య 728కి చేరింది. ఇదిలా ఉంచితే ఓవరాల్‌గా దేశంలో 624 మంది కోవిడ్‌ రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదు
ఇక పశ్చిమబెంగాల్‌లో వెలుగచూసిన కోవిడ్‌ కేసులపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సమీక్షా సమావేశం నిర్వహించారు.  దీనిలో భాగంగా ఆమె మాట్లాడతూ.. కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్నది పాండమిక్‌ కాదని, ఎండ్‌మిక్‌ అని ఆమె తెలిపారు.  పశ్చిమబెంగాల్‌ పరిస్థితి కోవిడ్‌ కంట్రోల్‌లోనే ఉందన్నారు మమతా. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌ 747 కోవిడ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 కొత్త కేసులు వెలుగుచూశాయి.   
 

 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)