Breaking News

దేశంలో కోవిడ్‌ కలకలం.. 3,395కు చేరిన యాక్టివ్‌ కేసులు

Published on Sat, 05/31/2025 - 17:05

ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్‌ కలకలం సృష్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 3,395కు యాక్టివ్‌ కేసులు చేరాయి. గత 24 గంటల్లో కోవిడ్‌తో నలుగురు మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు. కోవిడ్‌ నుంచి కోలుకుని 1435 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

8 రాష్ట్రాలలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 254, కేరళలో 1336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, వెస్ట్ బెంగాల్‌లో 205, ఉత్తరప్రదేశ్‌లో 117 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా కలకలం రేపింది. పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో విధులు నిర్వహించే వెంకట్ అనే వ్యక్తి కరోనా వచ్చినట్లు కేటీపీఎస్ హాస్పిటల్ వైద్యులు నిర్థారించారు. 

కాగా, ఏపీలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా కానీ.. ప్రజలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లోని ముగ్గురు ఉద్యోగులకు వైరస్‌ సోకింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటిట్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు ఆ ముగ్గురు ఉద్యోగుల్ని ఐసోలేషన్‌కి పంపించారు.

వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమను అప్రమత్తం చేయకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఏపీలో విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు.. ఇలా కేసులు వెలుగు చూశాయి. కడపలో కరోనా కేసు వెలుగు చూస్తే.. దానిని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)