Breaking News

దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

Published on Wed, 06/04/2025 - 10:52

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కేసులు(Covid-19 In India) అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,302కి చేరింది. గత 24 గంటల్లో 276 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 3,281 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, గుజరాత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రాల వైద్య శాఖలు అప్రమత్తమయ్యాయి. తాజా గణాంకాల్లో మొత్తం ఏడు కోవిడ్‌ మరణాలు సంభవించగా(Covid Deaths India Latest).. ఒక్క మహారాష్ట్రలో నలుగురు చనిపోయారు. అయితే ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉంటోందని అధికారులు అంటున్నారు.

మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో మంగళవారం తొలి కోవిడ్‌ కేసు(First Covid Case) నమోదు అయ్యింది. సిర్మూర్‌ జిల్లా నహాన్‌లో 82 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్య విభాగం ప్రకటించింది. వైరస్‌ కొత్త వేరియెంట్లు భారత్‌లో ప్రభావం చూపిస్తుండడమే కేసుల పెరుగుదలకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అదే సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)