Breaking News

డీకే శివకుమార్‌ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Mon, 11/27/2023 - 18:59

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ విదేశాలకు‌ వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్‌ 28 లోకల్‌ క్లైమేట్‌ యాక్షన్‌ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్‌ దుబాయ్‌ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్‌ 3 వరకు  దుబాయ్‌లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది. 

డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్‌ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది. 

అయితే డీకే దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్‌తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్‌ నెంబర్‌ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్‌కు 2019 అక్టోబర్‌ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్‌ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్‌పైనే ఉన్నారు. 

ఇదీచదవండి..వర్షంలో శరద్‌పవార్‌ స్పీచ్‌..సెంటిమెంట్‌ ఏంటంటే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)