దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి

Published on Mon, 06/26/2023 - 20:00

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లోనూ దర్జాగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు.ప్రగతి మైదాన్ టన్నెల్‌లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఓ భారీ దొంగతనానికి స్కెచ్‌ వేసిన దొంగలకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్‌ బజార్‌లో ఓ జంటను అడ్డగించిన దోపిడి దొంగలు వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. అయితే ఊహించని విధంగా వారి వద్ద కేవలం రూ. 20 నోటు తప్ప మరేం లభించకపోవడంతో.. బదులుగా వారికే రూ. 100 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఈ  వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.హెల్మెట్‌ ధరించి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను అడ్డగించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఇంతలో చోరికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ఎదుటి వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. దీంతో తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతులో డబ్బులు పెట్టిన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
చదవండి: పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!

దీంతో ఆ జంట సరాసరీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పారు. తమ వద్ద ఏం దొరక్కపోవడంతో దొంగతానికి వచ్చిన వారే రూ. 100 నోటు చేతిలో పెట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

వీరిద్దరినీ దేవ్ వర్మ, హర్ష్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్, రాజ్‌పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్‌లో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా ఇద్దరు ప్రభావితమయ్యారని, అతని గ్యాంగ్‌లో చేరాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)