Breaking News

Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్‌ సార్‌ కాదు’

Published on Fri, 04/25/2025 - 12:21

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 16న ఉత్తారఖండ్‌ మసూరీలో పెళ్లి. 19న హర్యానాలోని కర్నాల్‌లో రిసెప్షన్‌. ఏప్రిల్‌ 21న కశ్మీర్‌లో హనీమూన్‌. ఏప్రిల్‌ 23న కర్నాల్‌లో అంత్యక్రియలు. ఇండియన్‌ నేవి లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌ నర్వాల్‌ జీవితం ఇలా ముగిసింది.

ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన త్రీవవాదుల దాడిలో 26 మంది మరణించారు. వారిలో నేవి అధికారి వినయ్‌ నార్వాల్‌ ఒకరు.  పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి కొద్ది నిమిషాల ముందు వినయ్‌ నార్వాల్‌, ఆయన సతీమణి హిమాన్షి సరదగా గడిపిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన  నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.  

 
ఆ వీడియో మాదే 
కానీ,ఆ వీడియోలో ఉన్నది వినయ్‌ నార్వాల్‌ దంపతులు కాదని, ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్ శరావత్‌, యాషికా శర్మ దంపతులు సోషల్‌ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ మా వీడియోని షేర్‌ చేస్తున్నారు. నేవి అధికారి వినయ్‌ నర్వాల్‌ దంపతుల పేరిట వైరల్‌ అవుతున్న వీడియో మాదే. దుర్ఘటన జరిగే సమయంలో మేం అక్కడలేము.  

మేం బ్రతికే ఉన్నాం.. 
కశ్మీర్‌ టూర్‌లో ఉండగా ఏప్రిల్‌ 14న రికార్డ్‌ చేసిన వీడియోని ఏప్రిల్‌ 22న సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాం. అయితే అదే రోజు పహల్గాం దాడి జరగడం. మేం పోస్టు చేసిన వీడియోకి నెగిటీవ్‌ కామెంట్లు వచ్చాయి. వెంటనే వాటిని డిలీట్‌ చేశాం. కానీ అప్పటికే నేవి అధికారి వినయ్‌ నర్వాల్‌ దంపతుల పేరిట వీడియోని షేర్‌ చేశారని స్పష్టత ఇచ్చారు. యాషికా, ఆశిష్‌లు స్పందిస్తూ.. మేం బ్రతికే ఉన్నాం. మేం షేర్ చేసిన వీడియో ఇలా ఒక విషాద ఘటనకు లింక్ చేయడం మాకు బాధ కలిగింది. మేము లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను షేర్‌ చేయొద్దని కోరారు.

తప్పుడు ప్రచారం మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి
పహల్గాంలో వినయ్‌ నర్వాల్ దంపతులు సంతోషంగా గడిపిన చివరి క్షణం ఇదేనంటూ 19సెకన్ల వీడియోను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోపై వినయ్‌ నర్వాల్‌ సోదరి స్రిష్టి నర్వాల్‌ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తన సోదరుడు వినయ్‌, వదిన హిమాన్షి కాదని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ వినయ్‌ను అగౌర పరచొద్దని కోరారు. వినయ్‌ గురించి కుటుంబసభ్యులు సమాచారం ఇస్తారని అన్నారు. మేం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి పుకార్లు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)