Breaking News

డీఎంకే పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది: ప్రధాని మోదీ

Published on Fri, 01/23/2026 - 17:32

చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. తమిళ  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్‌) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ..  డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.

ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ  ప్రధాని మోదీ ఆరోపించారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)