Breaking News

భారీగా కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్‌

Published on Wed, 03/29/2023 - 13:29

ఢిల్లీ:  దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఐదు నెలల తర్వాత.. రెండు  వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2, 151 కేసులు నమోదు కాగా, క్రియాశీలక కేసుల సంఖ్య 11,903కి చేరినట్లయ్యింది. 

గత ఐదు నెలల కాలంలో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు యూపీలోనూ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే.. సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కానీ, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో కొత్త కేసులు 2 వేలకుపైగా వెలుగు చూశాయి. 

కేంద్రం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది కూడా. ఒమిక్రాన్‌ ఉపవేరియెంట్‌ ఎక్స్‌బీబీ 1.16 విజృంభణ వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసుల సంఖ్య కూడా ఎక్కువే బయటపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

ఇక మ్యూటెంట్‌ వేరియెంట్‌తో   రిస్క్‌ రేట్‌ తక్కువే అయినప్పటికీ.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాక్సినేషన్‌లోనూ పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)