Breaking News

భారత్‌లో కొత్తగా 6వేల కరోనా కేసులు

Published on Fri, 04/07/2023 - 10:33

ఢిల్లీ: భారత్‌లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. 

కేంద్రం తాజాగా శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..  భారత్‌లో కొత్తగా 6,050 కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి.  నిన్న(గురువారం) ఈ సంఖ్య 5,300గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది.  ఇక కేసుల సంఖ్య పోను పోను పెరుగుతుండంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మాన్షుక్‌ మాండవియా ఇవాళ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మం‍త్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉంటే.. కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనల నడుమ గతంలో కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కూడా. అయినప్పటికీ వైరస్‌ను ప్రజలు తేలికగా తీసుకుంటుడడం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైలెవల్‌ మీటింగ్‌ జరగనుంది.

దేశంలో ఎక్స్‌బీబీ.1.16 వేరియెంట్‌ విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ తీవ్రత తక్కువే అయినా.. వ్యాప్తి వేగంగా ఉంటోంది. హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ(వ్యాక్సినేషన్‌, ఇదివరకే ఇన్‌ఫెక్షన్‌ సోకి తగ్గిపోవడం) వల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఈ తరుణంలో ప్రజలు వైరస్‌ను తేలికగా తీసుకోవడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయి. ఒకవేళ వేరియెంట్‌లో గనుక విపరీతమైన మార్పులు సంభవిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు సైంటిస్టులు.

తెలంగాణ గురుకులంలో 15 కేసులు
ఇదిలా ఉంటే.. తెలంగాణ మహబూబాబాద్‌లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురుకుల పాఠశాలలో చదువుకునే 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌ సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు సూచించారు. జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలో పారిశుధ్య పనులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)