Breaking News

Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు

Published on Wed, 06/25/2025 - 07:23

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పోలీసులు విచిత్ర వివాదంలో చిక్కుకున్నారు. వారు ఒక దొంగకు చెప్పుల దండవేసి జమ్ములో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు ఆ పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి  ఒక దుకాణంలో నగదు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు.

అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని విషయంలో అమానవీయంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. పోలీసులు సిబ్బంది ప్రవర్తనపై విఘర్శలు తలెత్తాయి. వారు వృత్తికి విరుద్ధంగా, అనుచితంగా ప్రవర్తించారంటూ, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా యూజర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ  ఘటన తమ దృష్టికి వచ్చిందని, తాము వెంటనే విచారణకు ఆదేశించామని  పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు ఆ వ్యక్తిని  అర్థనగ్నంగా చేసి, చేతులకు సంకెళ్లు వేసి, చెప్పుల దండతో పోలీసు జీపు బోనెట్‌పై  కూర్చోబెట్టి జమ్మూ నగర వీధుల్లో తిప్పుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. బక్షి నగర్ ప్రాంతంలో  ఆ వ్యక్తి ఔషధం కొనుగోలు చేస్తూ, రూ. 40 వేలు చోరీ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఈఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమయ్యింది. 

ఇది కూడా చదవండి:  Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)