Breaking News

బెంగళూరులో​ కుక్కర్‌ పేలుడు.. రంగంలోకి ఎన్‌ఐఏ

Published on Wed, 08/14/2024 - 18:45

బెంగళూరు: బెంగళూరులో కుక్కర్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వంట సామాను మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కోణం లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ.. తీవ్రతను పరిశీలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం సంఘటనా స్థలానికి రంగంలోకి దిగింది. 

బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఉడిపి ఉపహారా ఫుడ్‌షాప్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు కుక్కర్‌ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.  

‘‘పేలుడు పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా తేలింది. ఉదయం దర్యాప్తు కోసం అక్కడి సామగ్రిని పరిశీలించాం. అల్లర్లు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పేలుడు తీవ్రతను తెలుకునేందుకు ఎన్‌ఐఏ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు’ అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు