Breaking News

ఢిల్లీలో అలా చేయడం కుదరదు: జస్టిస్ బీఆర్ గవాయ్

Published on Mon, 11/17/2025 - 17:04

ఢిల్లీ గాలి నాణ్యత కోసం కేంద్రం తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణకోసం నిర్మాణం రంగాన్ని పూర్తిగా నిలిపివేయడం సరైన చర్యకాదని తెలిపింది. ఢిల్లీతో పాటు ఆ నగర పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు, ఇతర కట్టడాలపై విధించిన నిషేదాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది

తాము పర్యావరణ నిపుణులు కామని, అయితే పర్యావరణ పరిరక్షణ అనేది అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. గాలి కాలుష్యాన్ని అడ్డుకోవడానికి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉ‍న్నాయని దానిని పూర్తిగా నియంత్రిస్తే అది వారి కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని అది తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. పర్యావరణ రక్షించడానికి నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో ముందుకు రావాలని  జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్రానికి ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత కేంద్రానిదేనని స్థానిక ప్రభుత్వానిది కాదని తెలిపారు. అదే విధంగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, గాలి నిర్వహణ కమిషన్ ఢిల్లీలోని ప్రస్తుత వాయు కాలుష్య పరిస్థితులను వివరించాలని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడం, కూల్చివేయడాన్ని నిషేదిస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు దానిని తిరస్కరించింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)