Breaking News

రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్‌ 

Published on Sun, 06/01/2025 - 05:29

ప్రయాగ్‌రాజ్‌:  సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని ఐక్యంగా, బలంగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ చెప్పారు. ఎన్నో విపత్కర పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పటికీ దేశం స్థిరంగా నిలిచి ఉందని, ఆ క్రెడిట్‌ రాజ్యాంగానికే దక్కుతుందని స్పష్టంచేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టులో అడ్వొకేట్‌ చాంబర్స్, మల్టి–లెవెల్‌ పార్కింగ్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని రూపొందించి, తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమరి్పంచిన సమయంలో దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నాయని కొందరు, ఏకీకృతంగా ఉందని మరికొందరు చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం పూర్తి సమాఖ్యం కాదు, పూర్తి ఏకీకృతం కాదని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బదులిచ్చినట్లు తెలిపారు. యుద్ధం, శాంతితోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని ఐక్యంగా, దృఢంగా ఉంచే రాజ్యాంగం మనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు.  

రాజ్యాంగ స్వర్ణ రథానికి రెండు చక్రాలు  
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని జస్టిస్‌ గవాయ్‌ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంలో దేశంలో సామాజిక, ఆర్థిక సమనత్వాన్ని తీసుకురావడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఎంతగానో కృషి చేశాయని ఉద్ఘాటించారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయం చేకూర్చడం మన ప్రాథమిక విధి అని న్యాయమూర్తులు, న్యాయవాదులకు పిలుపునిచ్చారు. 

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఆ ఆఖరి వ్యక్తిదాకా చేరుకోవాలని సూచించారు. భూసంస్కరణలతో ఎంతోమందికి మేలు జరిగిందని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. భూస్వాముల నుంచి భూములు పేదలకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. భూసంస్కరణ చట్టాలను ఎంతోమంది కోర్టుల్లో సవాలు చేశారని వెల్లడించారు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్య ఘర్షణ జరిగితే.. ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినట్లు గుర్తుచేశారు. 

రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ.. దాని మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదని 1973లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలే ఆత్మ అని పేర్కొంటూ, రాజ్యాంగ స్వర్ణ రథానికి ఇవి రెండు చక్రాలు అని వ్యాఖ్యానించారు. ఒక్క చక్రాన్ని ఆపినా మొత్తం రథం ఆగిపోతుందన్నారు. బార్, బెంచ్‌ అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని జస్టిస్‌ గవాయ్‌ స్పష్టంచేశారు. బార్, బెంచ్‌ కలిసికట్టుగా పనిచేయకపోతే రాజ్యాంగ రథం ముందకు సాగదని చెప్పారు.  
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)