కేంద్రంతో చర్చలకు సీజేపీ గ్రీన్‌సిగ్నల్‌.. వేదిక ఫిక్స్‌

Published on Fri, 07/24/2026 - 07:50

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన సీజేపీ నాయకత్వం, తటస్థ వేదికలోనే సమావేశం నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్లు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రేపు చర్చలకు పిలుపు వచ్చింది. తటస్థ వేదికలో సమావేశం నిర్వహించాలని మేము కోరాం. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. చర్చలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా ఎంపిక చేశారు’ అని తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, నిరసనల వేళ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్చల కోసం పలుమార్లు ఆహ్వానం పంపినప్పటికీ, కేంద్ర మంత్రుల నివాసాల్లో సమావేశాలకు తాము హాజరుకాబోమని సీజేపీ స్పష్టం చేసింది. జంతర్ మంతర్‌లోనే లేదా అందరికీ ఆమోదయోగ్యమైన తటస్థ వేదికలోనే చర్చలు జరగాలని పట్టుబట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, యువతలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, బాధ్యులపై కఠిన చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం వంటి డిమాండ్లతో సీజేపీ ఉద్యమం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి మోదీ పరీక్షా పేపర్ లీకుల కేసులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది తమ ప్రధాన డిమాండ్లకు పూర్తి పరిష్కారం కాదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న శుక్రవారం చర్చలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లపై ఎలాంటి హామీలు ఇస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

Videos

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)