Breaking News

Cash for query scam: ‘మహువా’కు బిగుస్తున్న ఉచ్చు

Published on Mon, 03/25/2024 - 08:02

న్యూఢిల్లీ: డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలడిగిన కేసులో  తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీపై సీబీఐ ఉచ్చు  బిగిస్తోంది. స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన దర్శన్‌ హీరానందాని, ఇతర వ్యక్తులతో కలిసి మహువా కుట్ర పన్నారని, పార్లమెంటు కల్పించిన ప్రత్యేక హక్కులను సొంతానికి వాడుకుని జాతి భద్రతను ప్రమాదంలో పడేశారని కేసు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.

లోక్‌పాల్‌ ఆదేశాల మేరకు మార్చ్‌ 21నే సీబీఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ కేసులో మహువాతో పాటు చేర్చిన ఇతర నిందితుల పేర్లు, సెక్షన్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణలో సీబీఐ ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని మహువా ఇళ్లపై ఇటీవల సీబీఐ సోదాలు కూడా జరిపింది. కాగా, వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని వద్ద డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని  ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ లక్ష్యంగా మహువా ప్రశ్నలడిగారన్న ఆరోపణలపై లోక్‌సభ నుంచి ఆమె సభ్యత్వాన్ని గత ఏడాది డిసెంబర్‌ 8న స్పీకర్‌ రద్దు చేశారు.

అంతకుముందు ఈ వ్యవహారంలో విచారణ జరిపిన పార్లమెంట్‌ ఎథిక్స్ కమిటీకి ఆమె స్నేహితుడు హీరానందాని స్వయంగా లేఖ రాశారు. మహువా తన పార్లమెంటు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను తనకు ఇచ్చారని దీని ద్వారా తాను ప్రశ్నలను నేరుగా పోస్ట్‌ చేయగలిగానని లేఖలో తెలిపారు. ఇది మోదీ రాయించిన లేఖ అని అప్పట్లో మహువా మండిపడ్డారు. కాగా,  తాజాగా  కేసులో మహువాతో పాటు హీరానందానిని కూడా ప్రధాన నిందితునిగా  చేర్చడం గమనార్హం.

ఇదీ చదవండి.. సునీత మరో రబ్డీ అయ్యేనా

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)