Breaking News

కర్ణాటక మోడల్‌...ఇక దేశమంతటా!

Published on Thu, 08/31/2023 - 06:04

మైసూరు: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక ప్రజలకిచ్చిన కీలక ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ఇప్పుడిక దేశమంతటా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఎన్నికల వాగ్దానమైన గృహ లక్ష్మి పథకం అమలుకు సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా బుధవారం శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా మైసూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. తామెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయబోమని చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనులను దేశమంతటా విస్తరించి చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు పేదల కోసమే పాటుపడాలన్నది కాంగ్రెస్‌ విధానమని చెప్పారు. ‘వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు దృఢంగా ఉంటుంది.

కన్నడ మహిళలు వేర్ల వంటివారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలను నిర్లక్ష్యం చేస్తూ అపర కుబేరులను మాత్రమే నెత్తిన పెట్టుకుంటోంది‘ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితరులు సభలో పాల్గొన్నారు. గత మే లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం తెలిసిందే. అందుకు దోహద పడ్డ ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ లక్ష్మి పథకం ఒకటి.  

చైనా మ్యాప్‌ తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమ అంతర్భాగంగా చూపుతూ చైనా తయారుచేసిన మ్యాప్‌ చాలా తీవ్రమైన అంశమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘ నేను ఇప్పుడే లద్దాఖ్‌ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ అంగుళం నెల కూడా అన్యాక్రాంతం కాలేదన్న మోదీ మాటలు పచ్చి అబద్ధాలు. చైనా మన భూమిని ఆక్రమించిందని లద్దాఖ్‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు‘ అన్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)