Breaking News

మణిపూర్‌ను వదిలేసి విదేశీ ప్రయాణాలా?

Published on Wed, 07/02/2025 - 08:30

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన విషయాలను వదిలేసి ప్రధా­న­మంత్రి నరేంద్ర మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. మణిపూర్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, అక్కడికి ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించింది. అదేవిధంగా, భారత్‌–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే ప్రకటనలు చేస్తున్నా మోదీ మౌనంగా ఉంటున్నారంటూ మంగళవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పలు వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీ నిర్ణయాల కారణంగానే ఆపరేషన్‌ సిందూర్‌లో మొదటి రెండు రోజుల్లో మనకు నష్టాలు మిగిలాయని రక్షణ శాఖ అధికారులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానమివ్వడం లేదన్నారు. పహల్గాంలో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను 70 రోజుల తర్వాత కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇది ప్రధాని తీవ్ర వైఫల్యంగా ఆయన పేర్కొన్నారు. ‘విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మన ప్రధాని మాత్రం విదేశాలకు పయనమవుతారు’అని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఈ నెల 2 నుంచి 8 రోజులపాటు ప్రధాని మోదీ 5 దేశాల పర్యటించనుండటం తెల్సిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)