Breaking News

అర్బన్‌ నక్సల్స్, తుక్డే గ్యాంగ్‌ కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయి

Published on Sat, 09/21/2024 - 05:15

వార్ధా: విపక్ష కాంగ్రెస్‌లోకి విద్వేష భూతం ప్రవేశించిందని, అర్బన్‌ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్‌ (సమాజాన్ని విచి్ఛన్నం చేసే శక్తులు) ఆ పార్టీని నడిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ అత్యంత అవినీతి పార్టీ. కాంగ్రెస్‌ రాజ కుటుంబం అత్యంత అవినీతి కుటుంబం’’ అని ధ్వజమెత్తారు. ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’కు ఏడాది పూర్తయిన మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.

 కాంగ్రెస్‌ నాయకులు విదేశీ గడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఆరోపించారు. ‘‘గణపతి పూజను సైతం కాంగ్రెస్‌ ద్వేషిస్తోంది. నేను గణపతి పూజలో పాల్గొంటే కాంగ్రెస్‌ నాయకులు బుజ్జగింపు రాజకీయాల కోసం నాపై ఆరోపణలకు దిగారు. కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో వినాయక విగ్రహాన్ని పోలీసు జీపెక్కించారు. అయినా మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ మిత్రపక్షాలు నోరు విప్పలేదు. తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి రాగానే పక్కన పెట్టింది. కాంగ్రెస్‌ అంటే అబద్ధం, మోసం’’ అని దుయ్యబట్టారు.

అంతర్జాతీయ స్థాయికి మన వస్త్ర పరిశ్రమ
విశ్వకర్మ యోజనతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికంగా లబ్ధి పొందుతున్నారని  మోదీ తెలిపారు. ‘‘మన వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏడాది కాలంలో 20 లక్షల మందికిపైగా విశ్వకర్మ యోజనలో చేరారు. 8 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారు’’ అని వెల్లడించారు.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)