Breaking News

మణిపూర్‌ హింసాకాండ.. మేం 4 రోజుల్లో ఆపేవాళ్లం: రాహుల్‌

Published on Mon, 01/22/2024 - 04:31

కలియబోర్‌: ప్రధానమంత్రి పదవిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత ఉండి ఉంటే మణిపూర్‌లో హింసకు నాలుగు రోజుల్లోనే పుల్‌స్టాప్‌ పడి ఉండేదని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా ఆదివారం అస్సామ్‌లోని నగావ్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తలుచుకుంటే మణిపూర్‌ హింసను సైన్యం సాయంతో మూడు రోజుల్లో ఆపగలిగేవారని అన్నారు.

కానీ, అలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘మణిపూర్‌ నాలుగు నెలలుగా మండుతున్నా, మన ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు. అదే కాంగ్రెస్‌ ప్రధానే ఉంటే మూడు రోజుల్లోనే అక్కడికి వెళ్లి ఉండేవారు. నాలుగో రోజుకల్లా అక్కడ హింస ఆగిపోయి ఉండేది’అని ఆయన చెప్పారు. ‘నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ, మనస్సు నిండా విద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్న వారు త్వరలోనే కనుమరుగవుతారు’అని రాహుల్‌ పేర్కొన్నారు.

జై శ్రీ రాం, మోదీ నినాదాలు, రాహుల్‌ ఫ్లయింగ్‌ కిస్‌లు...
నగావ్‌ జిల్లాలో న్యాయ్‌ యాత్ర సందర్భంగా రాహుల్‌కు నిరసన సెగ తగిలింది. ఒక చోట బీజేపీ కార్యకర్తలు జై శ్రీ రాం, మోదీ, మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్‌ గాంధీ ఫ్లయింగ్‌ కిస్‌లు విసురుతూ వారిని కలుసుకునేందుకు వెళ్లారు. సంబంధిత వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. తర్వాత ర్యాలీలో మాట్లాడుతూ.. ‘సుమారు 3 కిలోమీటర్ల దూరంలో 20 నుంచి 25 మంది వరకు బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందుకు వచ్చారు. నేను బస్సు దిగి వచ్చే సరికి వారంతా పారిపోయారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వశర్మ ఎవరొచ్చినా మేం భయపడేది లేదు’అని రాహుల్‌ తెలిపారు.

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు