Breaking News

నేడు కర్ణాటకలో కాంగ్రెస్‌ నిరసనలు

Published on Mon, 08/19/2024 - 06:22

బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్‌ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లోత్‌ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆదివారం ప్రకటించారు.

 ‘‘ ఏం లేకున్నా గవర్నర్‌ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు.  

22న సీఎల్పీ భేటీ
గవర్నర్‌ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

వాదించనున్న సింఘ్వీ, సిబల్‌ !
మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, కపిల్‌ సిబల్‌ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)