Breaking News

'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్‌

Published on Sat, 05/13/2023 - 15:32

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనేకమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జై బజరంగబలి అంటూ హనుమంతుని వేషధారణలో కనిపించారు. బజరంగబలి బీజేపీ వెంట లేడని కాంగ్రెస్‌ వెంటే ఉన్నాడని సెటైర్లు వేశారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. అంతేగాదు జై బజరంగబలి(హనుమంతుడు) బీజేపికి గట్టి జరిమానా విధించాడు అని హనుమంతుని వేషధారణలో ఉన్న కార్యకర్త అన్నారు.

కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బజరంగ దళ్‌ వంటి మితవాద సముహాలను నిషేధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసమయంలో అంశం పెను రాజకీయ వివాదాస్పద దుమారానికి దారితీసింది కూడా. దీంతో కాంగ్రెస్‌ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ..తాము తమ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తరుణం ఆసన్నమైందంటూ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టం చాలా పవిత్రమైనవని, బజరంగ్‌దళ్‌, పీఎప్‌ఐ వంటి సంస్థలు మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా, తన కర్ణాటకలోని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ..బజరంగ్‌ దళ్‌ పేరుతో తరుచుగా హింస, అప్రమత్తత, నైతిక పోలీసింగ్‌ వంటి వాటితో ముడిపడి ఉందని, ఇది నిషేధిత ఇస్లామిక​ గ్రూప్‌ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తో సమానం అని కాంగ్రెస్‌ తన మ్యానిపెస్టోలో పేర్కొంది. ఐతే ఆ సమయంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవ్వడంతో కాంగ్రెస్‌ వెనక్కి తగ్గింది.

పైగా బీజేపీ కూడా దీన్నే ఎన్నికల్లో కీలక అంశంగా కాంగ్రెస్‌పై విమర్శులు ఎక్కుపెట్టింది. ప్రచార ర్యాలీల్లో సైతం కాంగ్రెస్‌ హనుమంతుణ్ణి అవమానించిందని అందువల్ల మీరంతా ఓటేసేటప్పుడూ జై బజరంబలీ అని ఓటు వేయాలని ప్రధానితో సహా బీజేపీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు కూడా. మన సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని మీ ఓట్లతో తగిన విధంగా బుద్ధి చెప్పి శిక్షించాలని కోరారు. కానీ నేడు కాంగ్రెస్‌ అదే బజరబలీ వేషదారణలో తమ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడమే గాక హనుమంతుడు మావైపే ఉన్నాడని కాంగ్రెస్‌ గట్టిగా నినదించి చెప్పడం గమనార్హం.

(చదవండి:  బలవంతులపై పేదల శక్తి గెలిచింది.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్‌)


 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)