Breaking News

అలాంటి వాడింకా పుట్టలేదు! 

Published on Wed, 02/11/2026 - 11:54

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి బుధవారం లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు తీవ్రంగా ఖండించారు. ‘‘భరతమాతను ఎవరూ విక్రయించలేరు. ఆ ఆలోచన కూడా ఎవరూ చేయలేరు. అలా మన దేశాన్ని అమ్మేయగల, కొనగల వాడెవడూ ఇంకా పుట్టలేదు’’అంటూ రాహుల్‌ వ్యాఖ్యలను సభలోనే తిప్పికొట్టారు. 

దేశం ఇప్పటిదాకా చూసిన అత్యంత బలమైన ప్రధాని మోదీయేనని మంత్రి పేర్కొన్నారు. నిండు సభలో అబద్ధాలు చెప్పడం, వాటిపై సంబంధిత మంత్రి సమాధానం కూడా వినకుండా ని్రష్కమించడం రాహుల్‌కు అలవాటేనని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్‌ ఏ ప్రపంచంలో విహరిస్తుంటారో తెలియదు! విపక్ష నేతకు ఉండాల్సిన సీరియస్‌నెస్‌ ఆయనలో ఇసుమంతైనా లేదు. 

బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బదులిస్తున్నప్పుడు సభలో ఉండాల్సిందిగా సూచించినా ఆగకుండా వెళ్లిపోయారు. ఒక సభ్యుడు తన ప్రసంగం పూర్తవగానే సభ నుంచి నిష్క్రమించడం నిబంధనలకు విరుద్ధం’’అని దుయ్యబట్టారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రిజిజు మీడియాతో కూడా మాట్లాడారు. విపక్ష నేత ప్రసంగం పూర్తిగా అబద్ధాలమయమంటూ దుయ్యబట్టారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను కోరతామని పేర్కొన్నారు. అంతేగాక సభలో చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ధ్రువీకరించాలంటూ నోటీసిస్తామని కూడా చెప్పారు. 

ఆర్మీ మాజీ చీఫ్‌ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావిస్తానని రాహుల్‌ పట్టుబట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రధాని, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ నడుమ జరిగే సంభాషణలను బహిరంగంగా చర్చించడం నిషిద్ధం. అలా చేస్తే దేశ భద్రత పరిస్థితేమిటి? ఇలాంటి సున్నితమైన అంశంపై రాహుల్‌ చిన్నపిల్లాడిలా ప్రవర్తించారు. దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోజూశారు. దీన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. తాను ఎంపీనని, దేశ ప్రజల పట్ల తనకు నిర్దిష్ట బాధ్యతలున్నాయని ఆయన గుర్తుంచుకుంటే మంచిది’’అన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ కంకణం కట్టుకుందని రిజిజు మండిపడ్డారు. 

స్పీకర్‌తో దుర్భాషలు 
20 నుంచి 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లాను ఆయన చాంబర్లోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని రిజిజు ఆరోపించారు. కె.సి.వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ వాద్రా వంటి సీనియర్‌ నేతలు వాళ్లను వారించకపోగా మరింతగా ప్రోత్సహించారని ఆక్షేపించారు. ‘‘ఆ సమయంలో నేనూ అక్కడే ఉన్నా. బిర్లాపై కాంగ్రెస్‌ ఎంపీలు ఎలాంటి దారుణమైన పదాలు వాడారో చెప్పలేను! దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సహృదయుడు కాట్టి ఊరుకున్నారు గానీ లేదంటే వారిపై కఠిన చర్య తీసుకునేవారే’’అని చెప్పారు.  
 
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు