Breaking News

ఢిల్లీలో మార్నింగ్‌ వాక్‌.. కాంగ్రెస్‌ ఎంపీ చైన్‌ కొట్టేసిన దొంగ

Published on Mon, 08/04/2025 - 11:32

న్యూ ఢిల్లీ: రోజురోజుకీ చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని బైక్‌పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఈ అనుభవం ఓ మహిళా ఎంపీకి కూడా ఎదురైంది 

కాంగ్రెస్‌ మహిళా ఎంపీ సుధా రామకృష్ణన్‌ చైన్‌ దొంగతనానికి గురైంది. ఢిల్లీలో ఉదయం వాక్‌ చేస్తున్న సమయంలో తన మెడలోని గొలుసు దొంగలు కొట్టేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉదయం 6 గంటల సమయంలో ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో తోటి శాసనసభ్యడు, డీఎంకేకు చెందిన రాజాతితో కలిసి వాకింగ్‌ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు.  దొంగ తనా మెడ నుంచి గొలుసును లాగడంతో, ఆమె మెడపై గాయాలయ్యాయని, తన చుడిదార్ కూడా చిరిగిపోయిందని ఫిర్యాదులో తెలిపారు.

అదే విధంగా ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె  లేఖ రాశారు. స్కూటర్‌పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసును లాక్కెళ్లాడని ఆమె పేర్కొన్నారు. కాగా సుధా రామకృష్ణన్‌ తమిళనాడులోని మైలదుత్తురై నుంచి కాంగ్రెస్‌ తరపున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు.

 

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)