ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
కేరళలో దాండియా నృత్యం.. శశి థరూర్ పోస్ట్ వైరల్!
Published on Tue, 10/17/2023 - 16:18
ప్రస్తుతం ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒకే పండుగను చాలా భిన్నమైన పద్ధతుల్లో చేసుకుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు సైతం దాండియాను ఎంతో సంతోషంగా ఆడుతూ నవరాత్ర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు.
నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. 'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టెల్లో దాండియా నృత్యం' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Attention Gujarati sisters! This Navaratri, check out dandiya Kerala style! pic.twitter.com/tjNcmNd7oN
— Shashi Tharoor (@ShashiTharoor) October 16, 2023
Tags : 1