Breaking News

Rahul Gandhi: మోదీజీ.. మణిపూర్‌కు రండి

Published on Tue, 07/09/2024 - 05:56

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో కొన్ని నెలల క్రితం రావణకాష్టంగా రగిలిపోయిన మణిపూర్‌కు ప్రధాని మోదీ ఒక్కసారి సందర్శించి ఇక్కడి వారి కష్టాలను అర్థంచేసుకోవాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ విజ్ఞప్తిచేశారు. సోమవారం మణిపూర్‌లోని జిరిబామ్, చురాచాంద్‌పూర్‌ జిల్లాల్లో ఘర్షణల్లో సర్వస్వ కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌ పరామర్శించారు. 

బీజేపీపాలిత రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని ఓదార్చారు. వారి బాగోగులను అడిగి తెల్సుకున్నారు. ‘‘ సోదరుడిగా ఇక్కడికొచ్చా. మీ బాధలు, కష్టాలు వింటా. ఇక్కడ శాంతి నెలకొనాల్సిన సమయం వచి్చంది. హింస ప్రతిఒక్కరినీ బాధిస్తోంది. వేల కుటుంబాలు కష్టాలబారిన పడ్డాయి. ఆస్తుల విధ్వంసం కొనసాగింది. అమాయక జనం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. 

దేశంలో మరెక్కడా ఇంతటి దారుణాలు చోటుచేసుకోలేదు. మణిపూర్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొనేందుకు, మీకు బాసటగా నిలిచేందుకు, మీ సోదరుడిగా వచ్చా’’ అని బాధిత కుటుంబాలతో రాహుల్‌ అన్నారు. బాధితులను కలిశాక పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ మణిపూర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మోదీకి తెలియాలి. అందుకోసం ఇక్కడికి రండి. ఇక్కడ ఏం జరుగుతోందో తెల్సుకోండి. ప్రజల కష్టాలు వినండి’’ అని పరోక్షంగా మోదీకి విజ్ఞప్తి చేశారు. 

గవర్నర్‌తో భేటీ 
రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికేను సైతం రాహుల్‌ కలిశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంకా సద్దుమణకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు