Breaking News

‘‘ఇండియా కూటమికి నితీశ్‌ అంత్యక్రియలు చేశారు’’

Published on Tue, 02/06/2024 - 17:42

లక్నో: ఇండియా కూటమిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ కృష్ణమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పుట్టగానే దానికి ఎన్నో వ్యాధులు సంక్రమించాయని, ఆ తర్వాత అది వెంటిలేటర్‌పైకి వెళ్లిందని ప్రమోద్‌ అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఇండియా కూటమికి ఇటీవలే జేడీయూ చీఫ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పాట్నాలో అంత్యక్రియలు పూర్తి చేశారని చెప్పారు.  

ఇప్పుడిక ఇండియా కూటమి అనేది ఉనికిలో ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమోద్‌ ఇటీవలే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్రపైనా పదునైన విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధపడుతుంటే ఒక్క కాంగ్రెస్‌ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యాస్రం సంధించారు.

గత వారమే ఒక విషయమై ప్రమోద్‌ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన త్వరలో కాంగ్రెస్‌ను వీడీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమోద్‌ గత ఎంపీ ఎన్నికల్లో లక్నో నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. 

ఇదీచదవండి.. ‘‘ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)