Breaking News

‘సిక్కిం పొరుగు దేశమా?’.. బీజేపీ చురకతో కాంగ్రెస్‌ నేత క్షమాణలు

Published on Wed, 07/02/2025 - 12:33

న్యూఢిల్లీ: కొందరు రాజకీయ నేతల ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. దీంతో వారు అభాసుపాలవుతుంటారు. తాజాగా సిక్కింనకు చెందిన కాంగ్రెస్‌ నేత ఇదేవిధమైన వివాదంలో చిక్కుకున్నారు. తరువాత క్షమాపణలు చెప్పడంతో పాటు పొరపాటున నోరు జారానని వివరణ కూడా ఇచ్చారు.

సిక్కిం కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్  సిక్కింను పొరుగు దేశం అని పేర్కొన్న ఒక వీడియో వెలుగులో రావడంతో  అతని మాటలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీంతో అజోయ్ కుమార్ ఒక ప్రకటనలో తన నోరు జారడం వల్ల అలా  జరిగిందంటూ క్షమాపణలు చెప్పారు. తాను విలేకరుల సమావేశంలో భారత్‌- పొరుగు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల గురించి మాట్లాడుతూ, పొరపాటున సిక్కింను పొరుగు దేశంగా ప్రస్తావించాను. ఇది అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమంటూ అజోయ్ కుమార్ తన తప్పుకు వివరణ ఇస్తూ క్షమాపణలు  కోరారు.
 

కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్‌ తప్పుడు వ్యాఖ్యలను సిక్కిం బీజేపీ సిక్కిం యూనిట్ తీవ్రంగా ఖండించింది.. ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి, పార్లమెంటు సభ్యుడైన అజయ్‌ కుమార్‌ భారతదేశ చరిత్ర భౌగోళిక స్వరూపంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమని బీజేపీ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవమానకరమైన తప్పులను నివారించేందుకు, వెంటనే పార్టీ నేతలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. ఈ అంశంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనవాలా మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ జిన్నా అడుగుజాడలను అనుసరిస్తోందని, దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ‘నితీష్‌కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)