Breaking News

ఎన్టీపీసీ విద్యుత్తు తెలంగాణకు అక్కర్లేదా?

Published on Mon, 07/29/2024 - 05:04

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ కరెంట్‌ను అందుబాటులో ఉంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన పలు దఫాలుగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎస్‌టీపీపీ–2 ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తిని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగా పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసినా జవాబు రాలేదు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రం స్పందించని పక్షంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘గత మేనెల 30న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. అలాగే మార్చి 2024లో తెలంగాణలో గరిష్టంగా (పీక్‌ పవర్‌ డిమాండ్‌) 15.6 గిగావాట్ల డిమాండ్‌ ఎదురైంది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్‌ పవర్‌ డిమాండ్‌ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా, దానిని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని మరోసారి నిరూపితమైంది’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని సూచించారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)