Breaking News

కేంద్రం అన్ని ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తోంది

Published on Sat, 12/06/2025 - 02:48

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాకను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ప్రభుత్వం ఆహ్వనం పంపకపోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అదే సమయంలో, తమ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వనించడం, వెళ్తానంటూ ఆయన ప్రకటించడంపైనా స్పందించింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, పార్టీ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేరా మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విధానాలపై ఏమాత్రం విశ్వాసం లేని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలను పిలవకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇందులో తాము చెప్పడానికేమీ లేదని, దీనిపై ప్రభుత్వాన్నే అడగాలని వారు మీడియాతో వ్యాఖ్యానించారు. విందుకు పార్టీ ఎంపీ శశి థరూర్‌కు ఆహ్వనం అందడంపై వారు..‘ఈ విషయం థరూర్‌నే అడగండి. తమ పార్టీ నేతలకు ఆహ్వనం ఇవ్వకుండా, తమకు మాత్రమే పిలుపు అందిన సందర్భాల్లో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.

ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి. ఆహ్వనించడంలోనూ రాజకీయాలు నడుస్తుండటం ప్రశ్నార్థకం. అలా అందిన ఆహ్వనాన్ని అంగీకరించడం కూడా ప్రశ్నార్థకమే’అని వారు పేర్కొన్నారు. తనకు అందిన పిలుపుపై శశి థరూర్‌ స్పందిస్తూ.. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఆ విందుకు తాను వెళ్తున్నానన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలకు పిలుపు అందకపోవడం తనకు తెలియదని చెప్పారు. ఏదేమైనా తనకు ఆహ్వనం అందింది కాబట్టి, విందుకు హాజరవుతానని చెప్పారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు