Breaking News

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపై ప్రియాంక గురి 

Published on Fri, 10/23/2026 - 04:30

సాక్షి, న్యూఢిల్లీ:  వచ్చే ఏడాదిలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ)తో పొత్తు చర్చలకు కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సారథ్యం వహించే అవకాశాలున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో జరిగే చర్చల్లో ఆమె క్రియాశీల పాత్ర పోషించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలతో ప్రియాంక గాంధీ సుమారు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. 

దాదాపు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, గత ఎన్నికల ఫలితాలు, ఈసారి గెలుపు అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. వీటిని మూడు విభాగాలుగా వర్గీకరించి, సీట్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా కనీసం 125 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పరిస్థితిని బట్టి 150 స్థానాలు కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలతోపాటు, పార్టీ సీనియర్‌ నేతలకు పట్టున్న ప్రాంతాలపైనా ప్రియాంక ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. 

రాయ్‌బరేలీ, అమేథీ, సహారాన్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బలం ఉన్న కొన్ని అసెంబ్లీ స్థానాల కోసం పట్టుబట్టనున్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని ప్రియాంక వ్యూహం రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుపై నవంబరులోగా స్పష్టత తీసుకొచ్చే దిశగా ఆమె కసరత్తు చేస్తున్నారు. త్వరలో మిత్రపక్షాలతో కీలక చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)