Breaking News

అవిముక్తేశ్వరానందకు అనూహ్య మద్దతు

Published on Wed, 01/21/2026 - 08:06

ప్రయాగ్‌రాజ్ మాఘమేళా ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జ్యోతిర్మఠ శంకరాచార్యుడు స్వామి అవిముక్తేశ్వరానందను పోలీసులు పవిత్ర స్నానం చేయనివ్వకుండా అడ్డుకున్న సంగతి దుమారం రేపిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ విషయంలో యోగి సర్కార్‌తో అవిముక్తేశ్వరానంద ఓపెన్‌ చాలెంజ్‌కు దిగారు. ఈ తరుణంలో ఆయనకు అనూహ్య మద్దతు లభించింది.

కాంగ్రెస్‌ పార్టీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవిముక్తేశ్వరానందను ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తోంది. అయోధ్యలో నిర్మాణం పూర్తికాకుండానే ఆలయాన్ని ప్రతిష్టించడం తప్పని ఆయన అన్నారు. మహా కుంభమేళా నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలో గంగా నదిలో మృతదేహాలు తేలియాడడంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని యూపీ బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అని కాంగ్రెస్‌ అంటోంది.

చాలామంది బీజేపీని కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీగా భావిస్తారు. కానీ ఇప్పుడది హిందూ మతానని వదలడం లేదు. ఒక హిందూ సన్యాసినిని అవమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కారణంగా.. శంకరాచార్యుడు మొట్టమొదటిసారి పవిత్ర స్నానానికి దూరంగా ఉన్నారు. మొఘలులు, బ్రిటీషర్ల కాలంలోనూ ఇలా జరగలేదు. హిందువుల రక్షకులమని చెప్పుకునే ప్రభుత్వం ఇలాంటి పని చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా విమర్శించారు. అవిముక్తేశ్వరానంద కంటే మోహన్‌ భగవత్‌ గొప్పవారా?.. ఆయనకేమో జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ నడుమ పుణ్య స్నానాలు చేయించి.. ఈయన్నేమో అడ్డుకుంటారా?. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారాయన.

తిట్టిన వ్యక్తే..
అవిముక్తేశ్వరానంద గతంలో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2024లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం హిందువులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ మండిపడింది. ఆ సమయంలో  అవిముక్తేశ్వరానంద ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రసంగాన్ని వక్రీకరించారని, నిజానికి రాహుల్ “హిందూ మతం హింసను తిరస్కరిస్తుంది” అని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే..

2025 మే నెలలో మనుస్మృతిని రాహుల్‌ గాంధీ అవమానించారని చెబుతూ.. హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో శంకరాచార్య మఠం నోటీసు ఇచ్చినా రాహుల్ స్పందించలేదని, క్షమాపణ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది.. జనవరి 16వ తేదీన హిందువులను దూషించిన రాహుల్‌ గాంధీ అయోధ్య రామ మందిరంలో అడుగు పెట్టడానికి వీల్లేదని.. ఆయన వస్తే గనుక అడ్డుకోవాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును కోరారు. ఈలోపు.. ఆ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు మద్దతు ప్రకటించడం గమనార్హం.

అసలేం జరిగింది.. 
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి 46వ శంకరాచార్యుడు(స్వయం ప్రకటిత)  స్వామి అవిముక్తేశ్వరానందను మాఘమాసి అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌ రాజ్‌ త్రివేణి సంగమానికి తన అనుచర గణంతో రథంపై వచ్చారు. అయితే రథం దిగి నడుచుకుంటూ వెళ్లాలని అధికారులు అభ్యంతరాలు చెప్పారు. అలా మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానంగా మారింది. పోలీసులు సాధువుల మధ్య తోపులాట జరిగింది.  ఆ గొడ‌వ‌లో ర‌థాన్ని న‌దీ సంగ‌మానికి దూరంగా తీసుకెళ్లారు. అలా అవిముక్తేశ్వ‌రానంద ప‌విత్ర స్నానం చేయ‌లేక‌పోయారు.

ఆయనతో పాటు 200–300 మంది భక్తులు ఉన్నారని.. అనుమతులు లేవని.. భద్రతా సమస్యల దృష్ట్యా అడ్డుకోవాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చుకున్నాయి. అయితే ఇది శంకరాచార్యుడి హోదా వ్యక్తికి జరిగిన అవమానమంటూ అక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారాయన.

అవిముక్తేశ్వ‌రానంద‌కు నోటీసులు
జ్యోతిర్మఠ శంక‌రాచార్య అవిముక్తేశ్వ‌రానంద‌కు మాఘ‌మేళ నిర్వాహకులు షాకిచ్చారు.  నిజ‌మైన శంక‌రాచార్యా అవునా కాదా అని 24 గంట‌ల్లోగా నిరూపించుకోవాల‌ని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాఘ మేళ వ‌ద్ద అవిముక్తేశ్వ‌రానంద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపును ఓ అధికారి వెళ్లి నోటీసులు అందించారు.

సుప్రీం కోర్టులో వివాదం..
ఉత్తరాఖండ్‌ జ్యోతిర్మఠ శంక‌రాచార్య స్థానంపై దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. 1989 ఏప్రిల్ 8వ తేదీన స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి త‌న‌కు తాను శంక‌రాచార్య అని ప్ర‌క‌టించుకున్నారు. అయితే 1989 ఏప్రిల్ 15వ తేదీన ఆ పీఠానికి చెందిన వ‌సుదేవానంద స‌ర‌స్వ‌తిని వారసుడిగా శ‌తానంద ప్ర‌క‌టించారు. దీంతో ఆ పీఠానికి ఇద్ద‌రు పీఠాధిప‌తులు కొనసాగారు. 2022 సెప్టెంబ‌ర్‌లో స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి ప‌ర‌మ‌ప‌దించారు. ఆ మ‌రుస‌టి రోజే తానే శంక‌రాచార్య అంటూ అవిముక్తేశ్వ‌రానంద ప్ర‌క‌టించుకున్నారు. కానీ అదే ఏడాది అక్టోబ‌ర్‌లో ఆయ‌నపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. తుది తీర్పు వెల్ల‌డించే వ‌ర‌కు ఎవ‌ర్నీ శంక‌రాచార్య‌గా ప్ర‌క‌టించ‌రాదు అని, ప‌ట్టాభిషేకం కూడా నిర్వ‌హించ‌రాదని.. ఆ పోస్టును ఎవ‌రూ ఆక్ర‌మించ‌రాదని కోర్టు స్పష్టం చేసింది.

అయితే.. కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ మాఘ‌మేళ క్యాంపు వ‌ద్ద శంక‌రాచార్య అంటూ అవిముక్తేశ్వ‌రానంద బోర్డు పెట్టుకున్నారని.. అందుకే నోటీసులు ఇచ్చామని మాఘ‌మేళ అధికారులు చెప్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)