Breaking News

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాసం?

Published on Mon, 02/09/2026 - 11:33

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ తో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.

లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కేంద్రం గా రాజకీయం వేడెక్కింది. సభలో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆయన వైఖరిపై నిరసన చేపట్టన ప్రతిపక్షాలు నేడు ఆయనకు నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది.  అనంతరం  రాజ్యాంగంలో 94సీ ప్రకారం   స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

లోక్ సభలో చైనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన నిర్ణయం తీసుకోలేకపోయారని అంటున్న రాహుల్ ఆరోపించారు. ఆర్మీ జనరల్ నరవానే పుస్తకంలో ఉన్న  విషయాలను రాహుల్ లోక్ సభలో  ప్రస్తావించడాన్ని స్పీకర్ ఓం బిర్లా , బిజెపి ఎంపీలు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో  కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం

గతంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దంకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేసిింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీలుకు కోర్టు సమయం ఇచ్చినప్పటికీ  రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ  సెక్రటేరియేట్ నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో కాంగ్రెస్ ఆందోళన చేసింది.  స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది.
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)